హైదరాబాద్‌లోని పంజాగుట్ట–జూబ్లీహిల్స్–మాదాపూర్ మార్గంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్కు చుట్టూ అండర్‌పాస్‌లు, స్టీల్ వంతెనల నిర్మాణాన్ని రద్దు చేసి.. వాటి స్థానంలో 4 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతి ఇచ్చింది. రూ.1,090 కోట్ల ప్యాకేజీల స్థానంలో కొత్త ప్రణాళికను అమలు చేయనుంది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.