హైదరాబాద్ నగరంలో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా ముఠాలు సాధారణ ప్రజల్లో కలిసిపోయి ఈజీగా చోరీలకు పాల్పడుతున్నారు. వృద్ధులను టార్గెట్‌గా చేసుకొని దృష్టి మరల్చి దోపిడీలకు పాల్పడుతున్నారు. నగరంలో మహిళా ముఠాల చోరీలు, మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుబజార్లు, సంతలు, బస్సులు, మెట్రో, రైళ్లలో రద్దీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నవారిపై నిఘా ఉంచుతున్నారు. వివాహాలు, శుభకార్యాల్లో బంధువుల్లా ప్రవేశించి నగలు దోచుకునే ముఠాలపైనా పోలీసులు నిఘా పెంచారు.