హైదరాబాద్ కేపీహెచ్‌బీలో నిర్వహించిన బహిరంగ వేలంలో భూములు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. మొత్తం 16 ఓపెన్ ప్లాట్లకు వేలం జరిగింది. చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా.. గరిష్ఠంగా ఒక ప్లాట్ గజం రూ.2.70 లక్షలకు విక్రయమైంది. మరో ప్లాట్ గజం రూ.2.36 లక్షలకు, రెండు ప్లాట్లు రూ.2.06 లక్షల చొప్పున అమ్ముడయ్యాయి. మొత్తం 16 ప్లాట్ల విక్రయం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం వచ్చింది. సగటు ధర గజానికి రూ.1.79 లక్షలుగా నమోదైంది.