హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. నగరంలోనే తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు కానుంది. ఈ యాపిల్ రిటైల్ స్టోర్ కోసం భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ యాపిల్ రిటైల్ స్టోర్‌ను 2027 మొదట్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే దేశంలోని పలు మెట్రో నగరాల్లో యాపిల్ రిటైల్ స్టోర్స్ సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో నిర్మించే టీ-స్క్వేర్స్‌లో ఈ యాపిల్ రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.