గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. హై-టెక్ సిటీలోని కాపిటాలాండ్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో 40,000 చదరపు అడుగులకు పైగా స్థలాన్ని దీని కోసం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ కార్యాలయం ద్వారా ముఖ్యంగా పోస్ట్-ప్రొడక్షన్, VFX రంగాలపై దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మారడంతో.. నెట్‌ఫ్లిక్స్ యాజమాన్య ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..