కరీనంగర్ కలెక్టరేట్‌లో నిన్న (జనవరి 12న) జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డికి, డాక్టర్ సంజయ్ కుమార్‌కు మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. పాడి కౌశిక్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదు కాగా.. కరీంనగర్ పోలీసులు నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి.. జూబ్లీహిల్స్‌లో ఆయనను అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న కౌశిక్ రెడ్డిని.. కరీంనగర్ తరలించే అవకాశం ఉంది.