Hyderabad Elevated Corridor: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రకారకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నగరంలోని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు చేపడుతుండగా.. ఇదే క్రమంలో పలు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మించ తలపెట్టింది. ఇందులో భాగంగానే.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.