హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ వ్యతిరేకించారు. ఈ వార్తలపై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. విగ్రహాల ఏర్పాటుకు తాను వ్యతిరేకినని చెప్పారు. దయచేసి ప్రజాధనాన్ని రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని మెరుగుపరిచేందుకు వినియోగించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.