హైదరాబాద్‌లో రూ.10 కోట్ల విలువైన ఇళ్లకు భారీగా డిమాండ్.. 4 ఏళ్లలో 2 వేలకు పైగా ఇళ్ల అమ్మకాలు!

2 weeks ago 5
హైదరాబాద్‌లో రూ.10 కోట్లకు పైగా ధర కలిగిన విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో 2 వేలకు పైగా ఇళ్లు అమ్ముడయ్యాయని క్రెడాయ్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 625 అల్ట్రా లగ్జరీ ఇళ్ల విక్రయాలు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బెంగళూరు, చెన్నై నగరాల కంటే హైదరాబాద్‌లో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. కోకాపేట, నానక్‌రామ్‌గూడ, మంచిరేవుల వంటి ప్రాంతాల్లో ఇళ్లు కొనేందుకు ధనవంతులు ఎగబడుతున్నారు. విశాలమైన అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్రత్యేక సౌకర్యాలతో కూడిన లగ్జరీ టవర్లకు ప్రాధాన్యం ఇస్తుండటంతో డెవలపర్లు కూడా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు.
Read Entire Article