హైదరాబాద్‌లో భారీ అపార్ట్‌మెంట్ల వద్ద ఓలా, ఊబర్, ఐటీ కంపెనీల క్యాబ్‌లు, పాఠశాల బస్సులతో ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు హెచ్‌ఎండీఏ కొత్త నిబంధనలు తీసుకురానుంది. భవిష్యత్తులో నిర్మించే భారీ అపార్ట్‌మెంట్లలో ప్రైవేటు వాహనాల పికప్, డ్రాప్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించడం తప్పనిసరి చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉమ్టా అధ్యయనంలో 22 ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధితోపాటు మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ అనుసంధానానికి ప్రతిపాదనలు చేసింది.