హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు (సోమవారం) తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మంజీరా ఫేజ్-2 పైపుల మరమ్మతులు దృష్ట్యా 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు.