హైదరాబాద్ విలీనంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. పటేల్‌ను గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు

1 hour ago 1
హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మహాపాదయాత్ర ముగింపు సభలో కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సంస్థాన విలీనాన్ని ప్రస్తావిస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను గుర్తుచేశారు. కాంగ్రెస్ నిర్వహించిన ఓటు బచావో ర్యాలీపై విమర్శలు చేస్తూ.. అది చొరబాటుదారులను కాపాడే ప్రయత్నమని ఆరోపించారు. ఎస్‌ఐఆర్, ఈవీఎంల అంశాలపై రాహుల్ గాంధీకి పార్లమెంట్‌లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Entire Article