హైదరాబాద్‌ శివార్లలో రోడ్ల విస్తరణ.. 100 అడుగుల వెడల్పుతో రెండు కారిడార్లు

58 minutes ago 1
హైదరాబాద్ శివారు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలను తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ రెండు ప్రధాన రహదారుల విస్తరణకు భూసేకరణ ప్రారంభించింది. గొల్లపల్లి నుంచి పెద్ద గోల్కొండ వరకు కారిడార్‌ నంబర్‌ 15, ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు నుంచి బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పూర్‌ మీదుగా చేవెళ్ల రోడ్డును కలిపే కారిడార్‌ నంబర్‌ 19ను 100 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేయనున్నారు. రెండు మార్గాల కోసం 23,496 చదరపు గజాల భూమిని సేకరించనున్నారు. భూసేకరణపై అభ్యంతరాలకు 60 రోజుల గడువు ఇచ్చారు. పనులు పూర్తయితే ఓఆర్‌ఆర్‌ అనుసంధానం మెరుగుపడి, ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.
Read Entire Article