హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్ సమ్మిట్ నిర్వహించనున్నారు. కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల నుంచి 450 మంది ప్రముఖ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించారు. కేంద్రమంత్రులు, ఎంపీలు సహా పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంబంధాల బలోపేతం, ఆర్థిక పురోగతి, వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాల విస్తరణపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.