మద్యానికి బానిసైన ఓ తల్లి.. తన కన్నబిడ్డను అమ్మేసిన సంఘటన తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఓ మహిళ.. ఒక వ్యక్తితో సహజీవనం చేస్తూ.. వారిద్దరు మద్యానికి అలవాటయ్యారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి 10 రోజుల క్రితం పుట్టిన మగ బిడ్డను అమ్మేశారు. అయితే అంగన్వాడీ టీచర్‌కు వచ్చిన చిన్న అనుమానం కాస్తా.. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈ వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది.