అల్లూరి జిల్లాలోని కిలగడ పాఠశాల శతాబ్ధి వేడుకలకు సిద్ధమైంది. 120 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పాఠశాల ఈ ఏడాది ఏప్రిల్ నెలలో శతాబ్ధి ఉత్సవాలు జరుపుకోనుంది. 1905లో ఈ పాఠశాలను ఏర్పాటు చేయగా.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ ఈ ప్రాంతంలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 220 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.