Vijayawada Krishna Palace Bridge 133 Years History: కృష్ణా నదిపై స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన బ్రిడ్జి చరిత్రలో జ్ఞాపకంగా మిగలబోతోంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా ప్యాలెస్ బ్రిడ్జి కూల్చివేతలు మొదలు పెట్టారు. కొత్త డబుల్ లైన్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఈ పాత బ్రిడ్జి పిల్లర్లను కూల్చివేయబోతున్నారు.హైడ్రాలిక్ క్రేన్ల సాయంతో కూల్చివేతలు సాధ్యం కాకపోవడంతో.. అధికారులు లిమిటెడ్ బ్లాస్టింగ్ విధానంలో కూల్చేందుకు సిద్ధమవుతున్నారట.