దశాబ్దాలుగా భారతీయ సినిమాలు భారత ప్రజల జీవితాల్లో ఓ విడదీయలేని భాగంగా మారాయి. మన సంస్కృతి, భావోద్వేగాలు, ఆలోచనలపై సినీ ప్రపంచం విపరీత ప్రభావం చూపింది. ముఖ్యంగా 20వ శతాబ్దపు మద్య నాటికి బాలీవుడ్ వేదికగా ఎంతో మంది యువ నటీమణులు తీరని కలలతో సినీ రంగంలో అడుగుపెట్టారు.