యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వివిధ బ్యాంకుల తరపున పనిచేస్తున్న సుమారు 27 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బంది చాలీచాలని వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా.. వారికి రూ. 13 వేలకు మించని జీతాలు, కొందరికి కేవలం రూ. 7 వేలు మాత్రమే అందుతున్నాయి. ఈ అత్యల్ప వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. పెరిగిన నిత్యావసర ధరల కారణంగా తమ జీతాలను పెంచాలని వారు కోరుతున్నారు.