పాతబస్తీలో ఏటీఎంలో డబ్బులు పెట్టే సమయంలో వ్యాన్‌లో నుంచి డబ్బులు కొట్టేసిన సంఘటన తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా పోలీసులు నిందితులను గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ తన ఇద్దరు కొడుకులతో కలిసి రూ.17 లక్షలు కొట్టేసినట్లు తేల్చారు. చోరీ తర్వాత వ్యాన్ డ్రైవర్ కనిపించకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యాన్ డ్రైవరే నిందితుడు అని గుర్తించారు.