SV Deaf High School And SV Deaf Junior College Admissions: టీటీడీ విద్యా సంస్థలు బధిరులకు ఆశాకిరణంగా మారింది. ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానించింది టీటీడీ. ఈ విద్యా సంస్థల్లో దరఖాస్తులకు జూన్ 1 వరకు గడువు ఉంది. ఈ విద్యా సంస్థల్లోనాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిలో కూడా శిక్షణ అందిస్తున్నారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.