హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయాలపై అధికారులు చేపట్టిన దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ దుకాణం నుంచి 39 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వాట్సాప్ ఆర్డర్లు, డిజిటల్ చెల్లింపులు, డెలివరీ సేవల వినియోగంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేరళ, కర్ణాటక ప్రాంతాలతో సంబంధం ఉన్న రూ.10 కోట్లకు పైగా లావాదేవీల వివరాలనూ పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ-సిగరెట్లు చేరకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.