హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. భార్యాభర్తలతోపాటు 2 ఏళ్ల చిన్నారి కూడా విగతజీవిగా కనిపించడం గమనార్హం. అయితే మొదట వారి కుమార్తెను చంపి.. ఆ తర్వాత దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి మృతికి సంబంధించిన పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టారు. తమ మరణాలకు ఎవరూ కారణం కాదని.. ఇతరులను ప్రశ్నించవద్దని ఇంటి గోడపై రాశారు. ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.