ఓ తల్లికి కొడుకంటే పంచప్రాణాలు.. కొడుకే జీవితం అనుకుంది.. కానీ రెండు నెలలుగా కొడుకు జాడలేదు. రోజూ ఉద్యోగానికి వెళ్లే కొడుకు సాయంత్రానికి ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఆ రోజు రాలేదు.. కోడల్ని అడిగితే ఏదో సమాధానం చెప్పింది. రోజులు గడుస్తున్నాయి. ఇంకా వస్తాడు, ఇంకొచ్చేస్తాడు అని అనుకున్న ఆ తల్లికి ఎదురుచూపులే తప్ప కళ్లముందు కన్నకొడుకు కనిపించలేదు. ఇలా రెండు నెలలు ఎదురుచూసిన ఆ తల్లి.. ఇక నిరీక్షించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించింది. అలా తనయుడిపై తపనతో ఆ తల్లి చేసిన ఫిర్యాదు.. సభ్య సమాజానికి తెలియకుండా మరుగున పడిన ఓ దారుణాన్ని బయటకు తెచ్చింది.