Anakapalle Missing Woman Found With Aadhaar Card: అనకాపల్లి జిల్లాకు చెందిన యువతి ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయింది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గాలించారు. యువతి ఆచూకీ దొరక్కపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. అనూహ్యంగా ఐదేళ్ల తర్వాత ఆ యువతి ఆచూకీ దొరికింది. ఆమె ఆధార్ కార్డు ద్వారా వివరాలు తెలిశాయి.. తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి తీసుకెళ్లి తల్లికి అప్పగించారు. ఆమెకు వివాహమై కుమారుడు కూడా ఉన్నాడు.