సన్న ధాన్యానికి రికార్డు ధర.. గతంలో ఎన్నడూ లేని విధంగా, క్వింటా ఎంతంటే..?

1 hour ago 1
మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో జైశ్రీరాం సన్నధాన్యానికి రికార్డు ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాకు రూ.5,550 ధర లభించింది. రైతు భూక్యా పర్తీ విక్రయించిన 9.40 క్వింటాళ్ల ధాన్యానికి మొత్తం రూ.52,170 వచ్చాయి. మరోవైపు, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్‌కు సోమవారం 65 వేల బస్తాల ధాన్యం రావడంతో రద్దీ నెలకొంది. యార్డులో స్థలం సరిపోక ట్రాక్టర్లు ప్రధాన రహదారిపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మార్కెట్‌ సామర్థ్యానికి అనుగుణంగా టోకెన్‌ విధానం అమలు చేస్తే రద్దీని నియంత్రించవచ్చని వ్యాపారులు సూచిస్తున్నారు.
Read Entire Article