ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి టీమ్‌తో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో 2027 జనగణనకు సంబంధించిన వివిధ అంశాలు, ఎదురవుతున్న ఆందోళనలపై చర్చించినట్టు వైఎస్ జగన్ ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా సంబంధిత ఫోటోలను కూడా షేర్ చేశారు. 2027 జనగణనలో ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఓబీసీ లేదా బీసీలకు తప్పనిసరిగా కుల కాలమ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు.