అక్వాన్ తుఫాన్ ప్రభావంతో నవంబర్ 20వ తేదీన రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. విశాఖపట్నం నుంచి గుణుపూర్‌కు సంబంధించిన రెండు ప్యాసింజర్ రైళ్లను, విశాఖ నుంచి పలాస మార్గంలోని రైళ్లను పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే విధంగా విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807) రైలు మార్గాన్ని మళ్లించడం జరిగింది. దీంతో ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని రైల్వే శాఖ తెలియజేసింది.