ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ పరిశ్రమల కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఐఐసీ భూములను.. ఎంఎస్ఎంఈ పార్కులు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు కేటాయిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే నిషేధిత జాబితాలో ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.