అతడో నేరస్తుడు. రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత ఊరు, పేరు మార్చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం దాటేసి.. ఓ మహిళను పెళ్లి కూడా చేసుకున్నాడు. గత 23 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా వేషం మార్చి తిరుగుతున్నాడు. అయితే అతని పాపం పండి.. ఇప్పుడు దొరికిపోయాడు. అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు.. అప్పటి నుంచి గాలిస్తూనే ఉన్నారు.