బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీద చేయి చేసుకోవటంపై స్పష్టత ఇచ్చారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని 149 ఎకరాల్లో ఉన్న ఏకశిలా నగర్‌కు చెందిన ప్లాట్ యాజమానులు గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని.. అందులో భాగంగానే ఓ బాధితుడు తనతో గోడు వెళ్లబోసుకున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో.. తనకు సంబంధించిన స్థలానికి వెళ్లగా.. అక్కడ రియల్ ఎస్టేట్ సిబ్బంది వైఖరికి తాను అలా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.