25 రోజుల కస్టడీ తర్వాత.. బెయిల్‌పై బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

2 months ago 14
సింగరేణి బొగ్గు గనుల సంస్థకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.. 25 రోజుల జైలు జీవితం తర్వాత చంచల్‌గూడ కేంద్ర కర్మాగారం నుంచి గురువారం రోజు విడుదల అయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చిన సుమన్‌కు బీఆర్‌ఎస్ శ్రేణులు, బీఆర్‌ఎస్వీ నేతలు హారతులు, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Entire Article