విజయవాడ వాసులకు శుభవార్త. గన్నవరం విమానాశ్రయం నుంచి మరో నూతన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ- ఢిల్లీ ఇండిగో సర్వీసును కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.. శనివారం ప్రారంభించారు. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టులో అప్రోచ్ రోడ్డును ప్రారంభించారు. దీనితో కలిపి ఈ మూడు నెలల్లో నాలుగు కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. అలాగే గన్నవరం ఎయిర్ పోర్టులో నూతన టెర్మినల్ ఏడాదిలోపు ప్రారంభిస్తామని వెల్లడించారు.