మాజీ మంత్రి కొండా సురేఖ.. తన మాజీ ఓఎస్డీ సుమంత్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. గత 3 దశాబ్దాలుగా తమ కుటుంబంతో అనుబంధం కొనసాగిస్తూ.. కొడుకులా కష్టసుఖాల్లో తోడుగా నిలిచాడని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన ఫిర్యాదుతో సుమంత్‌పై దాడి, హత్యాయత్నం ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేయగా.. సుమంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం, కుటుంబ సభ్యులు పోలీసులపై చేసిన ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి.