సమాజం చీదరించుకుంటున్న ట్రాన్స్ జెండర్లను చేరదీసి.. వారికి కూడా ఉపాధి కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించటంపై ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు తమను చీదరించున్న సమాజం.. ఇకపై తమను స్వాగతిస్తుందని ఆశిస్తున్నట్టు ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే.. తమకు ఉన్న కోరికల చిట్టాను సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. వాలంటీర్స్‌గా చేస్తున్న వారికి 35 వేల స్టైపెండ్ ఇవ్వాలని.. జీహెచ్ఎంసీలోని ఇత శాఖల్లోనూ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.