Hyderabad nampally railway news: దక్షిమ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో 50 ఏళ్ల నాటి పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూల్చివేయాలని నిర్ణయించింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ బ్రిడ్జి వల్ల ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా తొలగించాలని భావిస్తున్నారు. డిసెంబర్ 20 నుంచి 23 మధ్య తొలగింపు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.