50 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..

3 months ago 13
తెలంగాణ రాష్ట్రంలో 50 ఏళ్లకు పైగా విద్యుత్ అందించిన ‘రామగుండం థర్మల్ స్టేషన్ (RTS)’లోని 62.5 మెగావాట్ల యూనిట్ మూతపడింది. 1971లో యూఎస్‌ఏఐడీ (USAID) సహకారంతో స్థాపించిన ఈ యూనిట్, తన జీవితకాలంలో 18,743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ముఖ్యంగా కరువు ప్రభావిత జిల్లాల వ్యవసాయ పంపుసెట్లకు ఇది వెలుగునిచ్చింది. జీవితకాలం ముగిసిందనే ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్లాంట్ మూతపడగా, దశాబ్దాలుగా ఇక్కడ పనిచేసిన కార్మికులు తీవ్ర భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.
Read Entire Article