Police Rowdy Sheet On 51 Ysrcp Leader: వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్ ఓపెన్ చేయాలంటూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 51 మందిపై రౌడీ షీట్ తెరవాలని ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఉన్న వారందరిపైన రౌడీ షీట్ తెరవాలని అందులో పేర్కొన్నారు. ఈ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సహా 51 మంది పేర్లు ఉన్నాయి.