ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది కల్లా రాష్ట్రంలోని 56 లక్ష మందికి వైద్య పరీక్షలు నిర్వహించి.. వాట్సాప్ ద్వారా రెండు రోజుల్లోగా రిపోర్టులు పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే జూలై నాటికల్లా రాష్ట్రంలో సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు, సంజీవని ప్రాజెక్టుపై సమీక్షించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.