JC Prabhakar Reddy Offers Garlands Sweets To Shop Owners: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక సమస్యలపై వినూత్నంగా స్పందించారు. తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్యపై షాపుల యజమానులకు చాలా రోజులుగా చెబుతున్నా వినకపోవడంతో.. దండేసి దండం పెట్టి, స్వీట్ తినిపించి మరీ చెప్పారు. రోడ్డు పక్కన, షాపులకు ఎదురుగా వాహనాలు పార్క్ చేయొద్దని కోరారు. ఈసారి వినకపోతే కాళ్లు పట్టుకుంటానన్నారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.