హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2పై కీలక అప్డేట్.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

3 hours ago 2
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2పై కీలక అప్డేట్ వచ్చింది. విస్తరణలో భాగంగా 76 కిలోమీటర్ల మేర ఐదు కొత్త కారిడార్లను రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇ్చచింది. నాగోల్‌–విమానాశ్రయం, రాయదుర్గం–కోకాపేట, ఎంజీబీఎస్‌–చాంద్రాయణగుట్ట, మియాపూర్‌–పటాన్‌చెరు, ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ మార్గాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పేర్కొన్నారు. విస్తరణ పూర్తయితే ఐటీ కారిడార్‌, పాతబస్తీ, నగర శివారు ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది.
Read Entire Article