6 వరుసలుగా HYD-విజయవాడ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం..!

7 months ago 9
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం సుముఖత తెలిపింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు. ఈ నెల 15న జరిగే ఫైనాన్స్ మీటింగ్‌లో విస్తరణకు ఆమోదం లభిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఈ పనులు జరుగుతాయి. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్-శ్రీశైలం రహదారి, ఎలివేటెడ్ కారిడార్ల పనులను కూడా త్వరగా ప్రారంభించాలని కోమటిరెడ్డి కోరగా.. గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
Read Entire Article