హైదరాబాద్‌ నుంచి వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు ఎప్పుడు?.. ట్రైన్ ప్రయాణికుల ఎదురుచూపులు

1 hour ago 1
హైదరాబాద్‌ నుంచి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్లను ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై ప్రయాణికుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం నగరం నుంచి పలు ప్రాంతాలకు చైర్‌కార్‌ రైళ్లు నడుస్తున్నాయి. దూర ప్రయాణాల్లో కూర్చొని వెళ్లాల్సిన ఇబ్బందిని స్లీపర్‌ రైళ్లు తొలగించనున్నాయి. దేశంలో హౌరా–కామాఖ్య, వారణాసి–న్యూదిల్లీ, బెంగళూరు–ముంబయి మార్గాల్లో స్లీపర్‌ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, ముంబయి, చెన్నై, విశాఖపట్నం, తిరుపతి మార్గాల్లో వీటిని నడిపే అవకాశాలను పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే కొత్త మార్గాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Entire Article