తెలంగాణలో సుమారు 1.50 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరిలో 1.30 లక్షల మంది చికిత్స పొందుతుండగా.. మరో 20 వేల మంది పరిస్థితిపై స్పష్టత లేదు. చికిత్సకు దూరంగా ఉన్నవారిని గుర్తించేందుకు టీసాక్స్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రారంభించింది. కోడ్ స్కాన్ చేసి ఏడు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే హెచ్‌ఐవీ రిస్క్ ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. రిస్క్ ఉన్నవారు ఏఆర్‌టీ కేంద్రాల్లో తదుపరి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 30 వేల మంది క్యూఆర్ విధానాన్ని వినియోగించారు.