గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ ఏడాది జనవరిలో డ్రోన్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అరకు పరిధిలోని ఎనిమిది ఆస్పత్రులతో నాలుగు డ్రోన్లు అనుసంధానమై ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. నాలుగు డ్రోన్ల ద్వారా ఇప్పటి వరకు 1800 మేర ట్రిప్పులు వేసినట్లు తెలిపారు. మొత్తం నాలుగు డ్రోన్లు కలిసి 71 వేల కిలోమీటర్లు ప్రయాణించాయని, ఇప్పటి వరకు 24,500 మందికి వైద్య సేవలు అందించినట్లు మంత్రి పేర్కొన్నారు.. 2200 పైగా వైద్య పరీక్షల నమూనాలను డ్రోన్ల ద్వారా తరలించినట్లు వివరించారు.