తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ వైపు వెళ్తోన్న సమయంలో నాలుగో లైన్‌లో పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో తక్షణమే స్పందించిన రైల్వే శాఖ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. దగ్గరలోని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించి ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్త వహించారు. రైల్వే అధికారులు కూడా పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు.