బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని కొందరు యువతీ యువకులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ నిందితుడిని పట్టుకుని పోలీసులకు కూడా అప్పగించారు. అయితే నిందితుడిని పోలీసులకు పట్టించిన వారిని తాజాగా సీపీ సజ్జనార్ సన్మానించారు. వారికి ప్రశంసా పత్రాలతోపాటు రివార్డు కూడా అందించారు. సమాజంలో ఇలాంటి నేరాలను అదుపు చేసేందుకు పౌరులు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు.