Adilabad District Collector Rajarshi Shah Name For A Village: ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషాపై గిరిజనులు అభిమానాన్ని చాటుకున్నారు. సొంతింటి కలను నిజం చేసినందుకు జీవితంలో మర్చిపోలేని విధంగా ఆయన పేరును వారి ఊరికి పెట్టారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పిప్పల్‌ధరి పంచాయతీ పరిధిలోని దహిగూడ గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. కానీ వారికి స్థలం లేకపోవడంతో కలెక్టర్‌ను కలిశారు.. ఆయన ఆ సమస్యను పరిష్కరించారు. అలాగే అన్ని సదుపాయాలు కల్పించారు. ఆయనపై గౌరవంతో ఆ గ్రామానికి ‘రాజర్షిషా గూడ’ అని పేరు పెట్టారు.