Andhra Pradesh BEL To Invest Rs 2500 Crores: ఏపీలో రక్షణ రంగ తయారీకి సంబంధించి మరో పరిశ్రమ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వరల్డ్ క్లాస్ డిఫెన్స్ రంగానికి సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయబోతోంది. శ్రీసత్యసాయి జిల్లాలో 914 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడితో రక్షణ పరికరాలు తయారు చేసే ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. యువతకు 800 ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.