ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ ఎన్నికల్లో జరుగుతున్నవి ఏకగ్రీవాలు కావు.. కూటమి పార్టీలు చేసిన బలాత్కారాలు అని ఆమె విమర్శించారు. ఒకప్పుడు వైసీపీ చేసిందని ఇప్పుడు మీరు చేస్తారా? వాళ్లు గడ్డి తిన్నారని, మీరు అదే తింటారా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బలవంతపు ఏకగ్రీవాల మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఫలితాలను నిలిపివేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు.